ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 2:16 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

విద్యార్థి నాయకుల అర్ధరాత్రి అరెస్టులు దారుణంఇంటెలిజెన్స్ వైఫల్యానికి ఇదే నిదర్శనం.

విద్యార్థి నాయకుల అర్ధరాత్రి అరెస్టులు దారుణంఇంటెలిజెన్స్ వైఫల్యానికి ఇదే నిదర్శనం.

జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం సెప్టెంబర్ 10 :

ఖానాపూర్ : BRSV (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) ఎలాంటి ఆందోళనకు పిలుపు ఇవ్వకపోయినా విద్యార్థి నాయకులను అర్ధరాత్రి నుంచి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని BRSV నాయకులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని వారు ఆరోపించారు.

BRSV ఎలాంటి ఆందోళనకు పిలుపు ఇవ్వకుండానే విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం పోలీస్ ఇంటెలిజెన్స్ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే విద్యార్థి నాయకులను అర్ధరాత్రి నుంచే అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధిస్తోందని BRSV నాయకులు ఆరోపించారు.

_విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయలేరని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును ప్రభుత్వం గౌరవించాలని వారు డిమాండ్ చేశారు.అరెస్టు అయినవారిలో.సుద్దాలమహిపాల్.మునుగురిప్రణీత్.పూసలమనోజ్.ఆడెపు రవి.చుక్కల నరేష్.శ్రీకాంత్ అమందా.సాయి రాజ్.అంజి.నవీన్.